Guntur District: ‘ఛలో ఆత్మకూరు’కు అనుమతి ఇవ్వండి.. పోటాపోటీగా పోలీస్ అధికారులను కలసిన టీడీపీ, వైసీపీ నేతలు

  • టీడీపీ, వైసీపీ పోటాపోటీ అనుమతులు
  • ఎస్పీని కలిసి అనుమతి కోరిన టీడీపీ నేతలు
  • ఐజీని కలిసిన వైసీపీ నేతలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపిస్తూ టీడీపీ ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చింది. దీనికి పోటీగా వైసీపీ కూడా ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని డీజీపీ చెప్పడంతో టీడీపీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మిని కలిసి అనుమతి కోరారు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిసి అనుమతి కోరారు.

టీడీపీ హయాంలో తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం వల్లే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైసీపీ నేతలు తెలిపారు. టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మద్దాలి గిరిధర్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తదితరులు ఎస్పీ జయలక్ష్మిని కలిసి అనుమతి కోరగా, వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, నందిగం సురేశ్ తదితరులు ఐజీని కలిసి అనుమతి కోరిన వారిలో ఉన్నారు.

More Telugu News