KCR: కేసీఆర్ మోసగాడని టీఆర్ఎస్ నాయకులే చెబుతున్నారు: మల్లు రవి

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కేసీఆరే కారణం
  • అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చారు
  • తప్పును కేంద్రం మీదకు నెట్టే ప్రయత్నం చేశారు

తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ ఒక ఆర్థిక టెర్రరిస్టు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమాంద్యం పేరుతో తప్పును కేంద్రం మీదకు నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ మోసగాడని టీఆర్ఎస్ పార్టీ నేతలే అంటున్నారని మల్లు రవి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని మందలించే ధైర్యం కూడా కేసీఆర్ కు లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మరెవరో కూల్చాల్సిన అవసరం లేదని... పార్టీలోని అసంతృప్తులే ప్రభుత్వాన్ని పడగొడతారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News