Teju: 'ఆర్డీఎక్స్ లవ్' నుంచి ట్రైలర్ రిలీజ్

  • మరో ప్రేమకథా చిత్రంగా 'ఆర్డీఎక్స్ లవ్'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు 
  • కీలకమైన పాత్రలో ఆమని

తెలుగు తెరను ఈ మధ్య కాలంలో ప్రేమకథలు మరింత ఎక్కువగా పలకరిస్తున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోన్న మరో ప్రేమకథా చిత్రమే 'ఆర్డీఎక్స్ లవ్'. 'హుషారు' ఫేమ్ తేజు కథానాయకుడిగా .. పాయల్ రాజ్ పుత్ కథానాయికగా ఈ సినిమా నిర్మితమైంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీనియర్ నరేశ్ .. నాగినీడు .. ఆదిత్య మీనన్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో, సీనియర్ హీరోయిన్ ఆమని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News