USA: అమెరికా మూన్ మిషన్ విజయవంతం కావడానికి కారణం అదే!: సంభాజీ భిడే

  • చంద్రుడిని చేరుకోవడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు 38 సార్లు విఫలమయ్యాయి
  • ఏకాదశి రోజున ప్రయోగం చేపట్టడంతో 39వ సారి విజయవంతమైంది
  • కాలాన్ని లెక్కించేందుకు భారత్ ఉపయోగించే విధానాన్ని అమెరికా అనుసరించింది

చంద్రుడిపైకి తమ వ్యోమనౌకను పంపేందుకు అమెరికా అంతరిక్ష శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు 39వ సారి ఫలించాయని ఆరెస్సెస్ మాజీ కార్యకర్త సంభాజీ భిడే చెప్పారు. వారి మూన్ మిషన్ విజయవంతం కావడానికి కారణం... ఏకాదశి రోజున ప్రయోగాన్ని చేపట్టడమేనని తెలిపారు.

చంద్రుడిని చేరుకోవాలని అమెరికా చేసిన ప్రయత్నాలు 38 సార్లు విఫలమయ్యాయని చెప్పారు. ఇన్ని సార్లు విఫలమైన తర్వాత ఓ అమెరికన్ శాస్త్రవేత్త కీలక సూచన చేశారని... మనం పాటిస్తున్న సిస్టమ్ ను వదిలేసి... కాలాన్ని లెక్కించేందుకు భారత్ ఉపయోగించే విధానాన్ని అనుసరిద్దామని చెప్పారని అన్నారు. ఆ తర్వాత చేపట్టిన ప్రయోగంలో అమెరికా స్పేస్ క్రాఫ్ట్ విజయవంతమైందని తెలిపారు. ఏకాదశి రోజున ప్రయోగాన్ని చేపట్టడమే వారి విజయ రహస్యమని చెప్పారు.

2018 జనవరిలో చోటు చేసుకున్న కోరేగావ్ అల్లర్ల కేసులో సంభాజీ నిందితుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని శివ్ ప్రతిష్ఠాన్ హిందుస్థాన్ సంస్థకు ఆయన అధినేతగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News