షమీకి ఊరట.. అరెస్ట్ పై స్టే విధించిన కోర్టు

10-09-2019 Tue 10:03
  • గృహ హింస కేసులో క్రికెటర్ మొహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్
  • రెండు నెలల పాటు స్టే విధించిన కోర్టు
  • తదుపరి విచారణ నవంబర్ 2వ తేదీకి వాయిదా
గృహ హింస కేసులో క్రికెటర్ మొహమ్మద్ షమీకి అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. విండీస్ టూర్ నుంచి తిరిగి వచ్చిన 15 రోజుల్లోపు లొంగిపోవాలంటూ కోర్టు షమీని ఆదేశించింది. గత ఏడాది షమీ భార్య హసీన్ జహాన్ అతనిపై కేసు పెట్టింది. అయితే, కోర్టు వాయిదాలకు షమీ హాజరుకాకపోవడంతో... అతనికి అరెస్ట్ వారెంటును కోర్టు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో షమీకి కోర్టు స్వల్ప ఊరటను కలిగించింది. షమీని అరెస్ట్ చేయకుండా రెండు నెలల పాటు స్టే విధించింది. తదుపరి విచారణ నవంబర్ 2న జరగనుందని షమీ తరపు న్యాయవాది సలీమ్ రెహ్మాన్ తెలిపారు. ఇండియా తరపున షమీ 70 వన్డేలు, 42 టెస్టులు, 7 టీ20లు ఆడాడు.