Srisailam: మూడున్నర లక్షల క్యూసెక్కులు దాటిన శ్రీశైలం వరద... 10 గేట్లు ఎత్తివేత!

  • 3.69 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద
  • 3.08 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్ కు
  • గేట్ల నిర్వహణపై విమర్శలు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు మరోసారి కృష్ణమ్మ పోటెత్తింది. నిన్న 1.40 లక్షల క్యూసెక్కులకుపైగా ఉన్న వరద, ఈ ఉదయం 3.69 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. నిన్న సాయంత్రం నాలుగు గేట్లను తెరిచిన అధికారులు, ఈ ఉదయం మరో ఆరు గేట్లను తెరిచి, 3.08 లక్షల క్యూసెక్కులను స్పిల్ వే ద్వారా నాగార్జున సాగర్ డ్యామ్ కు వదులుతున్నారు. మిగతా వరద నీరు వివిధ కాలువల ద్వారా ప్రజల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు పంపుతున్నారు.

కాగా, ఈ ఉదయం డ్యామ్ గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తూ కనిపించడంతో గేట్ల నిర్వహణపై అధికారులు శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది.

More Telugu News