ISRO: విక్రమ్ ల్యాండర్ పై నాగ్ పూర్ పోలీసుల చమత్కారం!

  • చంద్రయాన్-2 చివరిదశలో అపశృతి
  • విక్రమ్ ల్యాండర్ నుంచి అందని సిగ్నల్స్
  • దయచేసి రెస్పాండ్ అవ్వాలంటూ నాగ్ పూర్ పోలీసుల సరదా ట్వీట్

దేశవ్యాప్తంగా చంద్రయాన్-2, విక్రమ్ ల్యాండర్ గురించి చర్చ జరుగుతోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై పరిశోధనలు నిర్వహించే నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-2 ప్రాజెక్టు చేపట్టగా, చంద్రుడి ఉపరితలంపై సాఫీగా అడుగుపెట్టాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. ఈ అనూహ్య పరిణామం అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఇంతటి నిరాశాజనకమైన అంశంలోనూ నాగ్ పూర్ పోలీసులు హాస్యచతురత ప్రదర్శించారు. "డియర్ విక్రమ్, దయచేసి రెస్పాండ్ అవ్వు. 'సిగ్నల్స్' బ్రేక్ చేసినందుకు నీకేమీ చలాన్లు వేయడంలేదులే!" అంటూ చమత్కరించారు. నాగ్ పూర్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ మేరకు పోస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

More Telugu News