Telangana: తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శలు

  • పాలనలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు
  • ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం ఈ బడ్జెట్
  • రుణమాఫీపై బడ్జెట్ లో స్పష్టత లేదు

అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలకు ఈ బడ్జెట్ నిదర్శనమని అన్నారు. రుణమాఫీపై బడ్జెట్ లో స్పష్టత లేదని, కేసీఆర్ కు సీఎంగా కొనసాగే హక్కు లేదని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి గురించి బడ్జెట్ లో ప్రస్తావించలేదని విమర్శించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తూనే కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ నిధులను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నా, కేసీఆర్ ఆ పని చేయలేదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం’ ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటిస్తే తన కమీషన్ల లెక్కలు ఎక్కడ బయటకు వస్తాయో అని కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 24 వేల లోటు బడ్జెట్ రాష్ట్రంగా తయారు చేశారని ధ్వజమెత్తారు.

More Telugu News