Nani: ఇంద్రకీలాద్రిపై నాని సందడి.. ఫొటోలు ఇవిగో!

  • గ్యాంగ్ లీడర్ చిత్రం ఈ నెల 13న రిలీజ్
  • అమ్మవారి ఆశీస్సుల కోసం విజయవాడ వచ్చిన నాని
  • సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన ఆలయ వర్గాలు

టాలీవుడ్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ చిత్రంతో మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రంలో నాని మునుపెన్నడూ పోషించని సరికొత్త పాత్రలో నటించాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో నాని విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. నానీకి ఆలయ వర్గాలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. దర్శనం అనంతరం నానీకి ఆలయ అధికార వర్గాలు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించాయి. ఈ సందర్భంగా నాని దశాంజనేయ ఆలయాన్ని కూడా సందర్శించారు.

More Telugu News