ప్రకాశం జిల్లా కరవు తీరేలా నీటి సరఫరా!

- ప్రకాశం జిల్లాకు 2,250 క్యూసెక్కుల విడుదల
- అన్ని మేజర్ కెనాల్స్ కూ నీటిని వదులుతున్న అధికారులు
- నారుమళ్లు వేసుకునేందుకు రైతులు సిద్ధం
రైతులు నారుమళ్లు పోసుకునేందుకు అవసరమైన నీటిని మేజర్ కాలువలకు విడుదల చేయాలన్న రైతాంగం డిమాండ్ ను నెరవేర్చుతున్నామని అధికారులు అంటున్నారు. నిన్నమొన్నటి వరకూ వచ్చిన నీరు, చెరువులను నింపేందుకు సరిపోగా, ఇప్పుడు వస్తున్న నీటితో వరి వంటి నీటి ఆధారిత పంటలను వేసుకునేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.