Andhra Pradesh: ఏపీలో దసరా ఉత్సవాల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది!: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు
  • ఈ నెల 25లోపే ఉత్సవ ఏర్పాట్ల పూర్తి
  • విజయవాడలో మీడియాతో ఏపీ దేవాదాయ మంత్రి

త్వరలో దసరా పండుగ సీజన్ రానున్న నేపథ్యంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈసారి దసరా పండుగ ఉత్సవాల ఖర్చు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. విజయవాడలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ ఈవో సురేష్ బాబులతో కలిసి ఆయన దసరా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సర్కారులా కాకుండా దసరా ఖర్చును ఈసారి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సౌకర్యాలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లను ఈ నెల 25లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఫ్లైఓవర్ పనులు ఆటంకంగా మారొచ్చన్న అనుమానంతో నిర్మాణ సామగ్రిని రోడ్లపై నుంచి తొలగించాలని ఆదేశించామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

More Telugu News