Afghanistan: భారీగా నష్టపోతారు: అమెరికాకు తాలిబాన్ల హెచ్చరిక

  • ఈనెల 23న జరగాల్సిన అమెరికా, తాలిబాన్ నేతల సమావేశం
  • తాలిబాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుడు
  • చర్చలు జరగబోవంటూ ప్రకటించిన ట్రంప్

ఈ నెల 23వ తేదీన అమెరికా అధికారులు, ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ నేతల మధ్య జరగాల్సిన సమావేశం రద్దయిన సంగతి తెలిసిందే. తాలిబాన్లు జరిపిన కాల్పుల్లో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోవడంతో... తాలిబాన్లతో చర్చలు జరపబోవడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, తాలిబాన్ నేతలు మాట్లాడుతూ, తమతో శాంతి చర్చలను రద్దు చేసుకుంటే... అమెరికానే భారీగా నష్టపోతుందని హెచ్చరించారు. ఇరు వర్గాల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చలు శాంతియుతంగానే జరగడం గమనార్హం. కానీ, తాలిబాన్ల దాడి నేపథ్యంలో, ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాలిబాన్ల హెచ్చరికపై అమెరికా ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News