Payal rajput: గణేశ్ ఊరేగింపులో రోడ్డుపై చిందేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. వీడియో వైరల్!

  • స్నేహితులతో కలిసి సంబరాలు
  • సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు
  • ప్రస్తుతం ‘ఆర్డీఎక్స్ లవ్’లో నటిస్తున్న నటి

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ లో తొలి సక్సెస్ సాధించింది. తాజాగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా పాయల్ రాజ్ పుత్ సంబరాల్లో పాల్గొంది. ఈ ఊరేగింపులో స్నేహితులతో కలిసి ఆమె సంతోషంతో చిందేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ ఊరేగింపు ఎక్కడ జరిగిందన్న విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ‘ఆర్డీఎక్స్ లవ్’ అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను శంకర్ భాను తెరకెక్కిస్తుండగా, రాధన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను ఈ నెలలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News