Pakistan: బెల్లీ డ్యాన్సర్లతో పెట్టుబడిదారులకు వల వేస్తున్న పాకిస్థాన్

  • తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్
  • పెట్టుబడుల కోసం దిగజారుడుతనం 
  • ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న పాక్ జాతీయులు

తీవ్ర ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతున్న పాకస్థాన్... పెట్టుబడుల కోసం దిగజారి ప్రవర్తిస్తోంది. బెల్లీ డ్యాన్సర్ల చేత పెట్టుబడిదారులకు కనువిందు చేయించి... వారిని బుట్టలో వేసుకునేందుకు యత్నిస్తోంది. ప్రభుత్వ దిగజారుడుతనంపై ఆ దేశ ప్రజలే విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఓ వైపు ఇండియా చంద్రయాన్-2 ప్రయోగంలో బిజీగా ఉంటే... పాక్ మాత్రం బెల్లీ మిషన్ ను సమర్థవంతంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పాకిస్థాన్ కొత్త మార్గాన్ని కనుగొందని విమర్శిస్తున్నారు.

More Telugu News