Indian: స్టార్ హోటల్ లో ఇండియన్-2 షూటింగ్!

  • శంకర్ దర్శకత్వంలో చిత్రం
  • చెన్నై స్టార్ హోటల్ లో షూటింగ్
  • కమల్ సరసన నటిస్తున్న కాజల్ అగర్వాల్

సౌతిండియా స్టార్ కమలహాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 'ఇండియన్-2' షూటింగ్ చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జరుగుతోంది. ఇక్కడ కమల్ రహస్యంగా వ్యూహ రచన చేస్తున్న సీన్లను తీస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలు పాత్రలతో ఒకరికి తెలియకుండా ఒకరితో రహస్యంగా మాట్లాడతారట. ఆయన ఎవరెవరితో ఏ విషయాల్లో వ్యూహరచన చేస్తున్నారో ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ తదితరులు కూడా నటిస్తున్నారు. 1996లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'భారతీయుడు'కు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, మహిళలపై అఘాయిత్యాలు, మహిళా సాధికారత అంశంపై సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది.

More Telugu News