yadadri: అభ్యంతరకర చిత్రాలన్నీ తొలగించాం : యాదాద్రి ఆలయ ప్రధాన స్థాపతి ఆనంద్‌ వేలు

  • ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలగింపు పూర్తి
  • వాటి స్థానంలో సంప్రదాయ చిత్రాలు
  • గత చిత్రాలు, శిల్పులు వారి అభిమానంతో చెక్కినట్టున్నారు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయం స్తంభాలపై ఉన్న చిత్రాల్లో అభ్యంతరం వ్యక్తమైన వాటిని ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తిగా తొలగించినట్టు ఆలయ ప్రధాన స్థాపతి ఆనంద్‌ వేలు తెలిపారు. ఈరోజు ఆయన ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ కేసీఆర్‌తో పాటు ఇతర చిత్రాలు చెక్కడంలో ప్రభుత్వ పాత్ర లేదన్నారు. శిల్పులు వారికి ఉన్న అభిమానంతో ఈ చిత్రాలను స్తంభాలపై చెక్కారని భావిస్తున్నట్టు తెలిపారు. వీటిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో తొలగించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

దీంతో సీఎం కేసీఆర్, కారు, ప్రభుత్వ పథకాల చిత్రాలు, నెహ్రు, గాంధీ, రాజీవ్, కమలం పువ్వు చిహ్నాలు కూడా తీసివేశామని, చార్మినార్, తదితర చిత్రాలను కూడా తొలగించామన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నా వాటిని సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.  వాటి స్థానాల్లో ఆలయ సంప్రదాయ చిత్రాలను చెక్కే పనిని మొదలు పెట్టినట్లు ఆయన చెప్పారు.

More Telugu News