టిక్ టాక్ ఎఫెక్ట్.. హింసాత్మక వీడియోను తీసిన యువకులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Sun, Sep 08, 2019, 10:58 AM
  • తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఘటన
  • ‘మారి’ సినిమాలో ఫైట్ ఆధారంగా వీడియో షూటింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కొందరు నెటిజన్లు
సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ కొందరు యువకులను కటకటాలపాలు చేసింది. సరదా కోసం చేసిన వీడియో ఐదుగురు యువకులను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాశిపురానికి చెందిన ఐదుగురు యువకులు ఇటీవల ఓ టిక్ టాక్ వీడియో చేశారు.

అందులో ప్రముఖ నటుడు ధనుష్ నటించిన ‘మారి’ సినిమాలో ఆయుధాలతో దాడి చేస్తున్న సీన్ ను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో అనుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోకు విపరీతంగా లైక్ లు రావడంతో కొందరు ఇది హింసను రెచ్చగొట్టేలా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వీడియోను పరిశీలించిన పోలీసులు  వి.నగర్‌కు చెందిన సుడర్‌మణి (21)తో పాటు నలుగురిని పట్టుకుని స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha