ISRO: మీ ప్రయోగం స్ఫూర్తిదాయకం...చంద్రయాన్‌-2పై భారత్‌కు నాసా బాసట

  • చారిత్రక ప్రయత్నంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు
  • అంతరిక్ష ప్రవేశం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ
  • పరస్పర సహకారంతో ముందుకు వెళ్దాం

జాబిల్లి దక్షిణ ధృవాన్ని ముద్దాడాలని భారత్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేసిన ప్రయత్నం స్ఫూర్తిదాయకం అని నాసా పేర్కొంది. చంద్రుడిపైకి భారత్ పంపిన విక్రమ్‌ ల్యాండర్‌లో సాంకేతిక సమస్య తలెత్తి సమాచారం నిలిచిపోవడంతో ప్రయోగంపై అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా భారత్‌కు అండగా నిలిచింది.

ఇస్రో కృషి పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా కూడా భారత్‌ ప్రయత్నాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేసింది. ‘చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపాలన్న మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అంతరిక్ష ప్రవేశం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయినా మీ ప్రయత్నంతో మాలో స్ఫూర్తి నింపారు. ఈ ప్రయోగం భవిష్యత్తులో సౌరకుటుంబంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించేందుకు అవకాశం కల్పించింది’ అంటూ నాసా ట్విట్టర్‌లో పేర్కొంది.

More Telugu News