Imran Khan: ఆర్మీ చీఫ్ తో కలసి నియంత్రణ రేఖ వద్ద పర్యటించిన ఇమ్రాన్ ఖాన్

  • పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా పర్యటన
  • వెంట ఆర్మీ చీఫ్, పలువురు మంత్రులు
  • సైనిక బలగాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్-పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. ఇలాంటి తరుణంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా, రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషీ, కశ్మీర్ ప్రత్యేక కమిటీ ఛైర్మన్ సయ్యద్ ఫకర్ ఇమామ్ ఉన్నారు.

పాకిస్థాన్ రక్షణ, అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్వోసీ వద్ద వీరు పర్యటించారు. సరిహద్దుల వద్ద భారత్ నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పాక్ సైనికబలగాలు సిద్ధంగా ఉండాలని కొన్ని రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో తాజాగా నియంత్రణ రేఖ వద్ద పర్యటించాలని ఇమ్రాన్ నిర్ణయించారు.

More Telugu News