ISRO: ల్యాండర్ నుంచి సంకేతాలు రాకపోయినా ఆర్బిటర్ ఉందిగా!... అది తన పని తాను చేస్తుందంటున్న ఇస్రో వర్గాలు!

  • నిరాశపర్చిన చంద్రయాన్-2
  • చివరి దశలో మూగబోయిన విక్రమ్ ల్యాండర్
  • ప్రయోగంలో 5 శాతం మాత్రమే విఫలమైందన్న ఇస్రో సీనియర్ అధికారి

చంద్రయాన్-2 ప్రయోగం చివరిదశలో విఫలం కావడంతో యావత్ భారతదేశం నిరాశకు గురైంది. ఎవరెన్ని ఓదార్పు వచనాలు పలికినా, శాస్త్రవేత్తల సహా ప్రతి ఒక్కరూ నిస్పృహకు గురయ్యారన్నది వాస్తవం! అయితే, ఇంతటి బాధాకరమైన క్షణాల్లోనూ ఓ ఇస్రో సీనియర్ అధికారి చెబుతున్న మాటలు ఊరట కలిగిస్తున్నాయి.

విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం ఆగిపోయినంత మాత్రాన చంద్రయాన్-2 పూర్తిగా విఫలం అయినట్టు కాదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రయోగంలో 5 శాతం మాత్రమే విఫలమైనట్టు భావించాలని, చంద్రుడి చుట్టూ నిర్దేశిత కక్ష్యలో ఆర్బిటర్ పరిభ్రమిస్తూనే ఉందని, అది ఎంతో విలువైన సమాచారం సేకరించి భూమికి పంపిస్తుందని వివరించారు. సంవత్సరం పాటు ఆర్బిటర్ నుంచి చంద్రుడికి చెందిన ఫొటోలు, ఇతర డేటా అందుతాయని వెల్లడించారు. ఆ లెక్కన చూస్తే చంద్రయాన్-2 ప్రయోగం 95 శాతం సక్సెస్ అయినట్టేనని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

More Telugu News