chandrayan-2: చంద్రుడిపై మన ‘ప్రజ్ఞాన్‌’ పరీక్షలపై ఆశలు వదుకోవాల్సిందేనా?

  • సీనియర్‌ శాస్త్రవేత్తల మనోగతం ఇది
  • పునరుద్ధరణ ఇక కష్టమే అని వ్యాఖ్య
  • చివరి నిమిషంలో అంతరిక్ష నౌకతో సంబంధాలు కట్

చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపి అక్కడి మూలకాలు, వాతావరణ పరిస్థితుల అంచనా వేసేందుకు భారత్‌ పంపిన ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌పై ఇక ఆశలు వదులు కోవాల్సిందేనా? అంటే అవుననే అంటున్నారు ఇస్రో సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు. భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్‌-2 ప్రయోగానికి చివరి నిమిషాల్లో వైఫల్యం ఎదురైన విషయం తెలిసిందే.

దాదాపు 48 రోజులపాటు ప్రయాణం సజావుగా సాగడంతో ఇక విజయానికి చేరువైనట్టేనని భావించారు. కానీ విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా సంబంధాలు కోల్పోవడం ఇస్రో శాస్త్రవేత్తలనే కాదు, యావత్‌ భారత్‌ ప్రజల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. సంబంధాలు తెగిన ల్యాండర్‌తో సిగ్నల్స్‌ కోసం శాస్త్రవేత్తలు చేసిన అన్ని ప్రయత్నాలు విపలమయ్యాయి.

దీనిపై ఓ ఇస్త్రో సీనియర్‌ అధికారి మాట్లాడుతూ ‘విక్రం ల్యాండర్‌, దానిలోని ప్రజ్ఞాన్‌తో సంబంధాల పునరుద్ధరణ దాదాపు అసాధ్యం. అంటే దాన్ని మనం కోల్పోయినట్టే’ అని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రుడిపై విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అనంతరం ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌తో చంద్రుడిపై ఓ పగటి పూట (చంద్రుడిపై ఒక రోజు అంటే భూమిపై సుమారు 28 రోజులు. పూట అంటే సుమారు 14 రోజులు) పరీక్షలు జరిపేలా దాన్ని రూపొందించారు. కానీ ఫలితాన్ని పొందక ముందే దానితో సంబంధాలు తెగిపోయాయి.

More Telugu News