Modi: భారత రాష్ట్రపతి కావాలనుకుంటున్నానన్న బాలుడి ప్రశ్నకు అబ్బురపడిన మోదీ

  • మోదీతో కలసి చంద్రయాన్-2 ల్యాండింగ్ ను వీక్షించిన 70 మంది విద్యార్థులు
  • విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ప్రధాని
  • అవాంతరాలను ఎదుర్కొని విజయాలను సొంతం చేసుకోవాలని చెప్పిన మోదీ

చంద్రయాన్-2 ల్యాండింగ్ ను బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాని మోదీతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 70 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించారు. వీరంతా ఇస్రో నిర్వహించిన క్విజ్ లో గెలుపొంది, చంద్రయాన్-2 ప్రయోగాన్ని మోదీతో కలసి వీక్షించే అవకాశాన్ని దక్కించుకున్నారు. చంద్రయాన్-2 ల్యాండర్ తో కమ్యూనికేషన్ విఫలమైన తర్వాత... విద్యార్థుల వద్దకు వెళ్లిన మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. జీవితంలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా... వాటిని అధిగమించి విజయాలను కైవసం చేసుకోవాలని మోదీ వారికి తెలిపారు.

ఈ సందర్భంగా తాను భారత్ రాష్ట్రపతి కావాలనుకుంటున్నానని... ఈ దిశగా తనకు కొన్ని సలహాలు ఇవ్వాలని ఓ విద్యార్థి మోదీని కోరాడు. విద్యార్థి ప్రశ్నకు అబ్బురపడిపోయిన మోదీ... ప్రధాని కావాలని నీవెందుకు కోరుకోవడం లేదని సరదాగా ప్రశ్నించారు. రాష్ట్రపతే కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అని అడిగారు. ఈ సందర్భంగా చంద్రుడిపై ప్రయోగాలకు సంబంధించి మోదీతో తమ ఆలోచనలను విద్యార్థులు పంచుకున్నారు.

More Telugu News