Tirumala: రూ. 500 కోట్లు, 524 కిలోల బంగారం... శ్రీ వెంకటేశ్వరునికి ఐదు నెలల కానుకలు!

  • ఏప్రిల్ - ఆగస్టు హుండీ ఆదాయం ఘనం
  • 3 టన్నులకు పైగా వెండి కూడా
  • బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న సింఘాల్

గడచిన ఐదు నెలల కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి భక్తుల నుంచి వచ్చి హుండీ ఆదాయం రూ. 497.29 కోట్లుగా నమోదైంది. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ సగటున రోజుకు రూ. 3 కోట్లకు పైగా ఆదాయం లభించిందన్నారు. ఈ ఐదు నెలల వ్యవధిలో 524 కేజీల బంగారంతో పాటు 3 టన్నులకు పైగా వెండి, టీటీడీ నిర్వహణలోని వివిధ ట్రస్ట్ లకు రూ. 140 కోట్ల విరాళాలు అందాయని అన్నారు. త్వరలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేశామని అన్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారికి నిత్యమూ జరిగే ఆర్జిత సేవలను, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నామని అన్నారు. 9 రోజులు సాగే ఉత్సవాల్లో పది రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు పాల్గొంటాయని తెలిపారు.

More Telugu News