Mithali Raj: మిథాలీ రాజ్ స్థానంలో జట్టులోకొచ్చిన 15 ఏళ్ల బాలిక!

  • దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు హర్యానా అమ్మాయి షెఫాలీ వర్మ ఎంపిక
  • సెహ్వాగ్ తరహాలో విధ్వంసక బ్యాట్స్ ఉమన్ గా గుర్తింపు
  • 150కి పైగా స్ట్రయిక్ రేట్ తో దూకుడు

టీమిండియా మహిళల క్రికెట్లో మిథాలీ రాజ్ ఓ శిఖరం అని చెప్పాలి. అన్ని ఫార్మాట్లలోనూ రాణించిన మిథాలీ టి20 క్రికెట్ కు గుడ్ బై చెప్పేసింది. దాంతో ఆ లెజెండ్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడా ఉత్కంఠకు సెలెక్టర్లు తెరదించారు. 15 ఏళ్ల హర్యానా యువ సంచలనం షెఫాలీ వర్మకు భారత మహిళల టి20 క్రికెట్ జట్టులో స్థానం కల్పించారు. త్వరలోనే దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ లో షెఫాలీ కూడా ఆడనుంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి 3 మ్యాచ్ లకు ఆమెను ఎంపిక చేశారు.

షెఫాలీ వర్మకు భారత క్రికెట్లో చిచ్చరపిడుగు అనే ట్యాగ్ ఉంది. సెహ్వాగ్ తరహాలో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడగల షెఫాలీ దేశవాళీ క్రికెట్ లో 150కి పైగా స్ట్రయిక్ రేట్ తో మెరుపులు మెరిపించింది. టీమిండియా తరఫున ఆమె ఓపెనర్ గా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News