Ravichandran Ashwin: సన్ రైజర్స్ ఎంతో ట్రై చేసినా.... అశ్విన్ ను లాగేసుకున్న ఢిల్లీ కాపిటల్స్!

  • గత సీజన్ లో పంజాబ్ కు ఆడిన స్పిన్నర్
  • ప్లే ఆఫ్ దశకు జట్టును తీసుకెళ్లడంలో విఫలం
  • తదుపరి సీజన్ కు తీసుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్

గడచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తదుపరి సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. 2018లో అశ్విన్ ను రూ. 7.6 కోట్లకు పంజాబ్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

జట్టుకు కెప్టెన్ గానూ బాధ్యతలు నిర్వహించిన అశ్విన్, 12 మ్యాచ్ లలో జట్టును గెలిపించాడు. మరో 16 మ్యాచ్ లలో జట్టు ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది. తొలి దశలో మెరుగ్గా రాణించిన ఆ జట్టు, ఆపై వరుస ఓటములతో కుదేలైంది. ఇక ఓ యువ స్పిన్నర్ ను తీసుకోవాలని పంజాబ్ జట్టు యాజమాన్యం భావిస్తూ, నగదు ఒప్పందంపై అశ్విన్ ను ఢిల్లీకి బదలాయించింది. దీంతో అశ్విన్ ను తీసుకోవాలని చివరి వరకూ పోటీలో నిలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు, చివరికి విఫలమైంది.

More Telugu News