Pakistan: తొలుత అణ్వాయుధాలు ప్రయోగించకూడదన్న పాలసీ ఏమీ మా దగ్గర లేదు: భారత్‌కు పాక్ మరో హెచ్చరిక

  • రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్
  • తామేమీ అలాంటి నియమాలు పెట్టుకోలేదన్న గఫూర్
  • ఒకదాని వెంట మరో దాడి జరుగుతూనే ఉంటుందని హెచ్చరిక

కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్ రోజుకో హెచ్చరికతో రెచ్చిపోతోంది. యుద్ధం అనేది వస్తే భారత్‌పై తాము తొలుత అణ్వాయుధాలను ప్రయోగించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించి రెండు రోజులు కూడా కాకముందే ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ పరస్పర విరుద్ధ ప్రకటన చేశారు.

అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదన్న నియమమేమీ తమ వద్ద లేదన్నారు. అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదన్న పాలసీని భవిష్యత్తులో భారత్ మార్చుకునే అవకాశం రావచ్చంటూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత నెలలో చేసిన వ్యాఖ్యలపై గఫూర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అణ్వాయుధాలను తొలుత ప్రయోగించబోమన్న రూల్సేమీ మేము పెట్టుకోలేదు’’ అని గఫూర్ స్పష్టం చేశారు. దాడి అనేది మొదలైతే ఒకదాని వెంట మరొకటి జరుగుతూనే ఉంటుందని హెచ్చరించారు. అణ్వస్త్ర దేశాల విషయంలో యుద్ధం అనే మాటకు చోటు ఉండదని గఫూర్ పేర్కొన్నారు.

More Telugu News