దోపిడీ చేస్తూ దొరికిన 23 ఏళ్ల 'టిక్‌టాక్' స్టార్

- టిక్ టాక్ వీడియోలో పాప్యులర్ అయిన షారూఖ్ ఖాన్
- 40 వేల మంది ఫాలోవర్లు
- మరో దొంగతనానికి ప్లాన్ చేస్తూ దొరికిన వైనం
నిందితుల నుంచి వివిధ బ్రాండ్లకు చెందిన నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.3,520 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, చోరీల కోసం ఉపయోగించే ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశారు. షారూఖ్ ఖాన్ గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. అక్కడ ఉండగానే టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు తీసేవాడని పేర్కొన్నారు. నిందితులు నలుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం వారిని జైలుకు పంపింది.