Serena Williams: యూఎస్ ఓపెన్: క్వార్టర్ ఫైనల్‌లో గెలిచి రికార్డు సృష్టించిన సెరెనా విలియమ్స్

  • యూఎస్ ఓపెన్‌లో వందో విజయం సాధించిన సెరెనా
  • గ్రాండ్‌శ్లామ్ సెమీస్‌లోకి వెళ్లడం ఇది ఏకంగా 38వ సారి
  • చాలా సంతోషంగా ఉందన్న మాజీ చాంపియన్

యూఎస్ ఓపెన్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ సెరెనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. క్వార్టర్ ఫైనల్‌లో చైనాకు చెందిన ప్రపంచ నంబర్ 18 ప్లేయర్ కియాంగ్‌ను 6-1, 6-0తో 44 నిమిషాల్లోనే చిత్తు చేసింది. యూఎస్ ఓపెన్‌లో సెరెనాకు ఇది వందో విజయం కావడం గమనార్హం. ఆరుసార్లు ప్రపంచ విజేత అయిన సెరెనా ఈ విజయంతో సెమీస్‌లోకి ప్రవేశించింది. యూఎస్ ఓపెన్ సెమీస్‌లో సెరెనా అడుగుపెట్టడం ఇది ఏకంగా పదమూడో సారి కావడం గమనార్హం.

ఇక, గ్రాండ్ శ్లామ్ సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లడం ఇది ఏకంగా 38వ సారి. సెరెనా సెమీఫైనల్‌లో ఎలీనా స్విటోలినాతో తలపడనుంది. మ్యాచ్ అనంతరం సెరీనా మీడియాతో మాట్లాడుతూ విజయంపై ఆనందం వ్యక్తం చేసింది. ఇందుకోసమే తాను శ్రమించానని తెలిపింది. హార్డ్ వర్క్‌తో ఎప్పుడూ సంతోషమే దక్కుతుందని, దీనిని బట్టి తానెంత కష్టపడ్డానో అర్థం చేసుకోవచ్చని సెరెనా పేర్కొంది.

More Telugu News