Balakrishna: రేపటి నుంచి రంగంలోకి దిగుతోన్న బాలకృష్ణ

  • షూటింగు దశలో బాలకృష్ణ 105వ సినిమా 
  • నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆయన చేస్తోన్న 105వ సినిమాపైనే వుంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ .. వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. సెకండ్ షెడ్యూల్ ను ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ప్రధాన పాత్రల కాంబినేషన్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఆయన కొత్త లుక్ కి సంబంధించిన పోస్టర్ బయటికి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగిపోయింది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News