newzeland: న్యూజిలాండ్ లో వింటర్ గేమ్స్.. చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అమెరికా యువతి!

  • వింటర్ గేమ్స్ లో స్కీయింగ్ క్రీడ
  • పాల్గొంటున్న అమెరికా క్రీడాకారిణి సిమోన్స్
  • ఒక్కసారిగా ఊడిపోయిన స్కీ-స్ట్రక్

న్యూజిలాండ్ లో జరుగుతున్న వింటర్ గేమ్స్ లో పెను ప్రమాదం తప్పింది. అమెరికాకు చెందిన స్కియర్ జెన్నీ సిమోన్స్ స్కీయింగ్ చేస్తుండగా ఆమె కుడికాలికి అమర్చిన స్కి-స్ట్రక్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో అదుపు తప్పిన సిమోన్స్ దాదాపు 15 సెకన్ల పాటు మంచు కొండపై నుంచి పల్టీలు కొడుతూ కిందకు దొర్లింది. న్యూజిలాండ్ లోని క్వీన్స్ టౌన్ లో గత సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మంచుకొండపై స్కీ-స్ట్రక్ ఊడిపోవడంతో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన సిమోన్స్ పల్టీలు కొడుతూ చాలాకిందకు వచ్చేసింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయని వీక్షకులు, గేమ్స్ నిర్వాహకులు ఆందోళన పడ్డారు. అయితే వేగం తగ్గగానే కోలుకున్న సిమోన్స్ తాను క్షేమంగానే ఉన్నట్లు చేతుల ద్వారా సంకేతాలు ఇచ్చింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

ఈ విషయమై సిమోన్స్ మాట్లాడుతూ..‘నా జీవితంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. కొండపై నుంచి అదుపు తప్పగానే గట్టిగా ఉండు. ధైర్యంగా ఉండు. కాళ్లు విరగ్గొట్టుకోవద్దు అని నాకు నేనే చెప్పుకున్నా’ అని తెలిపారు. ఈ ఘటనతో తన ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పారు. కాగా, సిమోన్స్ రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే స్కీయింగ్ చేస్తున్నారు.

More Telugu News