Modi: పుతిన్ తో కలసి జ్వెజ్దా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ లో మోదీ పర్యటన.. ఆయుధాల టెక్నాలజీపై మోదీ ఫోకస్

  • రెండు రోజుల పర్యటన కోసం రష్యా చేరుకున్న మోదీ
  • తూర్పు దేశాల ఆర్థిక సదస్సుతో పాటు భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో పాల్గొననున్న పీఎం
  • 25 ఒప్పందాలపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా తూర్పు దేశాల ఆర్థిక సదస్సుతో పాటు భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో మోదీ పాల్గొననున్నారు. మొత్తం 25 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.

మరోవైపు, తన స్నేహితుడు, రష్యా అధినేతతో కలసి జ్వెజ్దా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్ కు మోదీ వెళ్లారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా, తక్కువ ధరకే ఆయుధాలను తయారు చేసే టెక్నాలజీని భారత్ కు అందించే అంశంపై మోదీ చర్చించనున్నారు. ఈ టెక్నాలజీ మనకు అందితే, తృతీయ ప్రపంచ దేశాలకు భారత్ అతి తక్కువ ధరకే ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయుధాల వ్యాపారంలో కీలక పాత్ర పోషించే అవకాశం కలుగుతుంది.  

More Telugu News