Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రష్మికకు బాలీవుడ్ నుంచి ఆఫర్ 
  • దర్శకుడిగా పీటర్ హెయిన్స్ 
  • మళ్లీ వెండితెరకు జెనీలియా

*  తెలుగులో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న కన్నడ భామ రష్మికకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. తెలుగులో హిట్టయిన 'జెర్సీ' చిత్రాన్ని బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు రష్మికను తీసుకుంటున్నారట.
*  పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పనిచేసిన పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నాడు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈయన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి నల్లమలుపు బుజ్జి ప్లాన్ చేస్తున్నాడు.
*  గతంలో పలు తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన జెనీలియా ఇప్పుడు మళ్లీ వెండితెరకు రావడానికి ప్రయత్నిస్తోంది. తన పునరాగమనాన్ని ఓ మంచి సినిమాతో చేయాలని భావిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఆ క్రమంలో ప్రస్తుతం పలు కథలు వింటోంది. త్వరలోనే ఒక ప్రాజక్టుకు ఓకే చెబుతుందని సమాచారం.  

More Telugu News