Congress: కర్ణాటక కాంగ్రెస్ లో తీవ్ర కలకలం... డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసిన ఈడీ

  • మనీలాండరింగ్ కేసులో శివకుమార్ అరెస్ట్
  • గత సెప్టెంబరులో కేసు నమోదు చేసిన ఈడీ
  • కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన శివకుమార్
  • పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం

మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. గత నాలుగురోజులుగా డీకే శివకుమార్ ను విచారిస్తున్న ఈడీ అధికారులు నేడు అరెస్ట్ చేశారు. గత సెప్టెంబరులో శివకుమార్ తో పాటు మరికొందరిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. హవాలా మార్గంలో లెక్కలు చూపని నగదును భారీగా తరలించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇన్ కమ్ ట్యాక్స్ విభాగం దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన వాంగ్మూలాన్ని రెండుసార్లు రికార్డ్ చేశారు.

ఈడీ సమన్లపై శివకుమార్ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. న్యాయస్థానం ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. తాజాగా, ఆయన అరెస్ట్ నేపథ్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఘాటుగా స్పందించాయి. బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. శివకుమార్ నిర్దోషి అని స్పష్టం చేసింది.

More Telugu News