Raviteja: వచ్చే ఏడాదిలో రవితేజ సినిమాలు ఇవే

  • త్వరలో విడుదల కానున్న 'డిస్కోరాజా'
  • గోపీచంద్ మలినేనితో యాక్షన్ ఎంటర్టైనర్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు కోసం లైన్లో సుధీర్ వర్మ  

ప్రస్తుతం రవితేజ హీరోగా 'డిస్కోరాజా' నిర్మితమవుతోంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఆ తరువాత సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'డాన్ శీను' సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత ప్రాజెక్టును సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ చేయనున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ కథా చర్చలు పూర్తయ్యాయనీ. కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్టుగా సమాచారం. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

More Telugu News