Andhra Pradesh: ‘ఉద్ధానం’ సమస్యపై జగన్ సర్కారు దృష్టి.. ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు!

  • పలాసలో 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు
  • ఆసుపత్రికి అనుబంధంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్
  • రూ.50 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో పలువురు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్ధానం కిడ్నీ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా పలాసలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పలాసలో 200 పడకల సామర్థ్యం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఆసుపత్రికి అనుబంధంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్లు పనిచేయనున్నాయి. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్ పద్ధతిలో 98 ఉద్యోగాలు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 60 ఖాళీలను ఈ సందర్భంగా భర్తీ చేయనున్నారు.

More Telugu News