Jammu And Kashmir: కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు మళ్లీ షాక్.. భారత్ కు జైకొట్టిన దక్షిణాసియా దేశాలు!

  • మాల్దీవుల్లో సుస్థిరాభివృద్ధిపై సదస్సు
  • హాజరైన దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్లు
  • రౌండ్ టేబుల్ భేటీలో పాక్ కు చుక్కెదురు

జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా మాల్దీవుల పార్లమెంటులో పాకిస్థాన్ కు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ అన్నది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని మాల్దీవుల్లో జరుగుతున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం చేసిన వాదనలను సదస్సు పట్టించుకోలేదు.

ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాక్ డిమాండ్ ను తిరస్కరించిన సదస్సు.. పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్(సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు. ఈ భేటీలో భారత ప్రతినిధి బృందానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు. ఆయన ప్రతిపాదించిన పలు సవరణలకు సదస్సులో ఏకగ్రీవ ఆమోదం లభించింది.

More Telugu News