Andhra Pradesh: పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారంటూ లేఖ సృష్టి.. కేసు పెడతామని జనసేన వార్నింగ్!

  • పవన్ పదవిని వదులుకుంటున్నారని ప్రచారం
  • సినిమాల్లోకి రాబోతున్నారని లేఖ చక్కర్లు
  • చట్టపరంగా చర్యలు ప్రారంభించామన్న జనసేన

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించబోతున్నట్లు ఓ తప్పుడు లేఖను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని జనసేన పార్టీ తెలిపింది. జనసేన అభిమానులు, మద్దతుదారులు పవన్ కల్యాణ్ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్న వేళ ఈ లేఖ వెలుగులోకి వచ్చిందని పార్టీ చెప్పింది. పవన్ కల్యాణ్ తన పదవిని వదులుకుని సినిమాల్లోకి రాబోతున్నట్లు చక్కర్లు కొడుతున్న ఆ తప్పుడు లేఖను నమ్మవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి లేఖను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నవారిపై కేసు నమోదుచేసి లీగల్ గా ముందుకు వెళతామని హెచ్చరించింది. ఇందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News