Tirumala: తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల సంఖ్య!

  • కేవలం ఐదు కంపార్టుమెంట్లలోనే భక్తులు
  • సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం
  • వినాయక చవితి పండగే కారణం!

తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లోనూ వాడవాడలా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కావడంతో, భక్తుల రాక మందగించిందని టీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉదయం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కేవలం ఐదు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచివుండగా, వారికి గరిష్ఠంగా నాలుగు గంటల వ్యవధిలోనే దర్శనాన్ని కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక నిన్న మధ్యాహ్నం నుంచే రద్దీ తగ్గిపోగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.22 కోట్లు వచ్చింది. ఈ వారాంతం వరకూ రద్దీ సాధారణంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News