China: 'లవ్ ఎక్స్ ప్రెస్' ఎక్కండి... నచ్చిన వారిని ఎంచుకోండి... చైనా ప్రభుత్వం కొత్త స్కీమ్!

  • చైనాలో 'లవ్ ఎక్స్ ప్రెస్' 
  • 2 వేల మంది ప్రయాణించే చాన్స్
  • భాగస్వాములను ఎంచుకునే అవకాశం

పెళ్లికాని అబ్బాయిలకు, అమ్మాయిలకు చైనా ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేలా వారికే అవకాశమిస్తూ, 'లవ్ ఎక్స్ ప్రెస్' పేరిట ప్రత్యేక ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన 1000 మంది యువకులు, 1000 మంది యువతులు ఈ రైల్లో ప్రయాణించి, తమ జీవిత భాగస్వామిని వెతుక్కోవచ్చని ప్రచారం చేస్తోంది.

చైనా మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం 10 కోచ్‌ లు ఉండే 'లవ్ ఎక్స్‌ప్రెస్' ట్రైన్‌ మ్యాచ్ మేకింగ్ సర్వీస్ లను అందిస్తుంది. మూడేళ్ల క్రితం ఈ తరహా రైలును అధికారులు నడుపగా, మూడు వేలకు పైనా యువతీ యువకులు ప్రయాణించారు. వీరిలో పలువురు వివాహం చేసుకోగా, మరింతమంది రిలేషన్‌ షిప్‌ కొనసాగిస్తున్నారు.

ఈ రైలులోనే తమకు ప్రియురాలు లభించిందని, భార్య దొరికిందని చెప్పేవారి సంఖ్య ఇప్పుడు చైనాలో క్రమంగా పెరుగుతోంది. దేశంలో జనాభా పెరిగిపోవడంతో 1970 నుంచి నియంత్రణ విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు వృద్ధుల సంఖ్య పెరిగిపోయి, యువత సంఖ్య తగ్గడంతో, నిబంధనలను సడలించి, జనాభాను పెంచేందుకు చర్యలు చేపడుతోంది.

More Telugu News