ys vivekananda reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. పోలీసుల వేధింపులు తాళలేక నిందితుడి ఆత్మహత్య

  • కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • సీఎం జగన్, వైఎస్ భాస్కరరెడ్డిలకు వేర్వేరు లేఖలు
  • సీఐ రాములు  తీవ్రంగా వేధించాడన్న కుటుంబ సభ్యులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులకు తాళలేకే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నిందితుడు శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. వివేకా హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కరరెడ్డిలకు శ్రీనివాసుల రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశాడు. మరోవైపు, శ్రీనివాసులరెడ్డిని సీఐ రాములు తీవ్రంగా వేధించినట్టు కుటుంబసభ్యులు ఆరోపించారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన శ్రీనివాసులరెడ్డి కడప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

More Telugu News