ganesh prasadam: వినాయక ప్రసాదం డోర్‌ డెలివరీ: ఓ హోటల్‌ నిర్వాహకుల వినూత్న ప్రయోగం!

  • చవితి ఉత్సవాల సందర్భంగా కొత్త పథకం
  • ఉండ్రాళ్లతోపాటు పలు పిండివంటలతో ప్యాకేజీ
  • ఉత్సవాల పదకొండు రోజులు అందుబాటులో సదుపాయం

వ్యాపారానికి వినూత్న ఆలోచనలే పునాది. కొత్తగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తుంటాయి. ఉరుకుల పరుగుల జీవితంతో బిజీగా ఉన్న నగర జీవుల్లో వంట వండుకునే సమయం, ఆసక్తి తగ్గిపోయాయి. ఒకప్పుడు పండగంటే ఘుమఘుమలాడే పిండివంటలు స్వయంగా చేసుకుని ఇంటిల్లిపాది ఆరగించే వారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి సూక్ష్మ కుటుంబాలు వచ్చాక, దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే హోటల్‌ ఆహారమే ప్రధానమైపోయింది.

రోజూ తినే ఆహారం కోసమే హోటళ్లపై ఆధారపడుతున్న వారికి పండగ రోజు భారీగా పిండి వంటలు చేసుకునే ఓపిక ఉంటుందా? సరిగ్గా ఈ బలహీనతే తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు హైదరాబాద్‌లోని 'ఆంధ్రా తాలింపు' రెస్టారెంట్  ‌ యాజమాన్యం. ఈరోజు నుంచి వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల నుంచి పదకొండు రోజులపాటు జరగనున్నాయి.

దీంతో ఈ పదకొండు రోజులు ఫోన్‌లో ఆర్డర్‌ ఇస్తే చాలు.. మీ ఇంటికే ప్రసాదం డోర్‌ డెలివరీ చేస్తామంటూ ఆఫర్‌ ఇచ్చింది ఈ హోటల్‌.  చవితి ప్రసాదం కిట్ పేరుతో కేజీ ఉండ్రాళ్లు, 10 పూర్ణాలు, 10 గారెలు, హాఫ్ కేజీ పులిహోర, హాఫ్ కేజీ చక్కెర పొంగలి, హాఫ్ కేజీ రవ్వ కేసరి' ప్యాక్ ను కేవలం రూ. 470కే అందిస్తున్నారు.

More Telugu News