యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ దూకుడు.. ఆకస్మిక తనిఖీలతో అధికారుల హడల్‌

02-09-2019 Mon 13:42
  • రెండు రోజుల క్రితం బాలికల పాఠశాల సందర్శన
  • అబ్బాయిలు అసభ్యంగా మాట్లాడితే దాడి చేయాలని సూచన
  • అనంతరం అంగన్‌వాడీ కేంద్రం సందర్శన

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కదా... తనదైన కొత్త మార్గంలో ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికారులను హడలగొడుతున్నారు. రెండు రోజుల క్రితం బారాబంకి జిల్లాలోని ఓ బాలికల పాఠశాలను సందర్శించారు. అక్కడి బాలికలతో మాట్లాడారు.

‘బాలికలు అన్ని సందర్భాల్లోనూ ధైర్యంగా ఉండాలి. ఆత్మరక్షణ కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులపై ఆధారపడకూడదు. అమ్మాయిలను కించపరిచే విధంగా ఏ అబ్బాయి అయినా మాట్లాడితే ఎదురు తిరగండి. వాడిపై రాళ్లతో దాడి చేయండి’ అంటూ సూచించారు. ఆ తర్వాత ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి పిల్లలతో ముచ్చటించారు. బర్లాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రభుత్వ వైద్య పథకాల అమలు తీరుపై ఆరాతీశారు. ఇలా ఆనందీబెన్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండంతో అధికారులు బెంబేలెత్తుతున్నారు.