Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేసు నమోదు!

  • పంజాబ్ లోని భటిండాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నిర్మాణం
  • లైబ్రరీని తొలగించి నిర్మించడంపై ఇద్దరు వ్యక్తుల పిటిషన్
  • ఈ నెల 6 వరకూ గడువిచ్చిన కోర్టు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీపై కేసు నమోదైంది. పంజాబ్ లోని భటిండా సివిల్ లైన్స్ క్లబ్ లో ఓ లైబ్రరీని తొలగించి కాంగ్రెస్ పార్టీ జోనల్ కార్యాలయాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. దీంతో  జగ్జీత్ సింగ్, శివదేవ్ సింగ్ లు స్థానిక కోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ ను విచారించిన కోర్టు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నేత సునీల్ జఖ్ఖర్, ఇతరులకు నోటీసులు జారీచేసింది.

ఈ పిటిషన్ పై ఈ నెల 6లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. కాగా, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించలేదు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఇటీవల విముఖత చూపడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సోనియాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News