Tennis: కోహ్లీ ఆదుకోకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటో?: ఇండియన్ టెన్నిస్ స్టార్ సుమీత్ నగల్

  • యూఎస్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్‌కు చుక్కలు చూపించిన సుమీత్
  • కోట్లాది మంది భారతీయుల హృదయాలు గెలిచిన యువ టెన్నిస్ ప్లేయర్
  • 2017 నుంచి కోహ్లీ ఫౌండేషన్ తనను ఆదుకుంటోందన్న టెన్నిస్ ఆశా కిరణం

యూఎస్ ఓపెన్‌లో దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు చుక్కలు చూపించి కోట్లాది మంది భారతీయుల్లో యువ టెన్నిస్ ప్లేయర్ సుమీత్ నగల్ ఆశలు రేకెత్తించాడు. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ భారతీయుల హృదయాలు గెలుచుకున్నాడు. ఫెదరర్‌పై తొలి సెట్ గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆ తర్వాత రెండు సెట్లలోనూ ఓడినప్పటికీ టెన్నిస్‌లో భారత్ బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతోందని ప్రపంచానికి చాటిచెప్పాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్వయంగా ఫెదరర్.. సుమీత్ దగ్గరికొచ్చి అభినందించాడు.

తాజాగా, సుమీత్ మాట్లాడుతూ.. టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీ తనను ఎంతగానో ఆదుకున్నాడని చెప్పాడు. ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కోహ్లీ తనను ఆదుకున్నాడని చెప్పాడు. కోహ్లీ కనుక తనను ఆదుకోకపోయి ఉంటే తానేం చేసేవాడినో తనకే అర్థం కావడం లేదన్నాడు. క్రీడాకారులను ప్రజలు ఆదుకుంటే దేశంలో క్రీడలు మరింత అభివృద్ధి చెందుతాయని సుమీత్ చెప్పుకొచ్చాడు.  2017 నుంచీ కోహ్లీ ఫౌండేషన్ తనను ఆదుకుంటోందన్నాడు. రెండేళ్లుగా తన ప్రదర్శన బాగోక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పాడు. కోహ్లీ కనుక తనను ఆదుకోకపోయి ఉంటే తన పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేదని సుమీత్ పేర్కొన్నాడు.

More Telugu News