Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'వాల్మీకి'లో సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ 
  • ధనుశ్ తాజా చిత్రం 'తూటా'
  • కైరా అద్వానికి భారీ ఆఫర్ 

 *  వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న 'వాల్మీకి' చిత్రం కోసం నాటి 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ..' హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాటను వరుణ్, పూజా హెగ్డేలపై గోదావరి తీరంలో చిత్రీకరిస్తున్నారు.
 *  ధనుశ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తమిళంలో రూపొందిన 'ఎనై నోక్కి పాయుమ్ తూటా' చిత్రం తెలుగు వెర్షన్ కి 'తూటా' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ నెల 6న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
*  'కబీర్ సింగ్' సినిమాతో ఇటీవల హిందీలో హిట్ కొట్టిన కథానాయిక కైరా అద్వానీ తాజాగా ఓ తమిళ చిత్రంలో నటించనుంది. విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందే భారీ చిత్రంలో కథానాయిక పాత్రకు కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం.

More Telugu News