Crows: ఓ యువకుడ్ని మూడేళ్లుగా వెంటాడుతున్న కాకులు!

  • మధ్యప్రదేశ్ లో విచిత్రం
  • హోటల్ కార్మికుడికి చుక్కలు చూపిస్తున్న కాకులు
  • కాకిపిల్ల మరణంతో రెచ్చిపోయిన కాకులు

కాకి అంటే మన సమాజంలో ఓ దుష్ట జీవిగానే గుర్తింపు ఉంది. కాకి వ్యవహారశైలి అలాగే ఉంటుంది. అయితే సాధారణంగా వ్యక్తుల జోలికి రాని కాకులు మధ్యప్రదేశ్ లో ఓ యువకుడ్ని మాత్రం మూడేళ్లుగా వెంటాడుతున్నాయి. అతడు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రత్యక్షమవుతూ దాడి చేస్తున్నాయి. ఆ యువకుడి పేరు శివ. సుమైలా గ్రామానికి చెందిన శివ ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఓ ముళ్లపొదలో కాకిపిల్ల చిక్కుకుని ఉండడం గమనించి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు.

అప్పటికే ఆ కాకి పిల్లకు రక్షణగా అక్కడ కొన్ని కాకులు తమ అరుపులతో హంగామా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ కాకిపిల్లను కాపాడేందుకు శివ ప్రయత్నించగా, దురదృష్టవశాత్తు కాకిపిల్ల మరణించింది. దాంతో కాకులు రెచ్చిపోయాయి. అప్పటినుంచి శివ కనిపిస్తే చాలు పొడవడం మొదలుపెట్టాయి. ప్రతి రోజూ ఇదే తంతు! దాంతో ఆ హోటల్ కార్మికుడు ఇంట్లోంచి బయట అడుగుపెట్టాలంటే చేతిలో ఓ కర్ర తప్పనిసరి అయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News