ISRO: చంద్రయాన్-2లో మరో కీలక ప్రక్రియకు రంగం సిద్ధం

  • ఆర్బిటర్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడదీసే ప్రక్రియకు ఇస్రో సన్నాహాలు
  • సోమ, మంగళవారాల్లో ప్రక్రియ
  • సెప్టెంబరు 7న చంద్రుడిపై అడుగిడనున్న చంద్రయాన్-2

భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్-2 మరికొన్ని రోజుల్లో చంద్రుడిపై కాలు మోపనుంది. ఈ క్రమంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. సోమవారం కానీ, మంగళవారం వేకువజామున కానీ, చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ ను వేరు చేయాలని ఇస్రో నిర్ణయించింది.

ఈ ప్రాజెక్టులో ఎంతో కీలకంగా భావిస్తున్న ల్యాండింగ్ మాడ్యూల్ లో విక్రమ్ర్ అనే ల్యాండర్, ప్రజ్ఞాన్ అనే రోవర్ ముఖ్య భాగాలు. వీటిసాయంతోనే చంద్రుడి దక్షిణ ధృవభాగంలో ఇస్రో పరిశోధనలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ రెండు యంత్రాలతో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ ను ఆర్బిటర్ నుంచి విడదీసి సెప్టెంబరు 7న చంద్రయాన్-2ను చంద్రుడిపై ల్యాండ్ చేయాలన్నది ఇస్రో ప్రణాళికల్లో భాగంగా ఉంది.

More Telugu News