Kerala: కేరళ కాలేజీలో పాక్ జెండాలను ఎగురవేసిన విద్యార్థులు.. 25 మందిపై కేసు

  • కోజికోడ్‌లోని పెరంబర సిల్వర్ కాలేజీలో ఘటన
  • కాలేజీ ఎన్నికల్లో భాగంగా జెండాను ఎగురవేసిన ఎంఎస్ఎఫ్
  • కాలేజ్ క్యాంపస్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న బీజేపీ

కోజికోడ్‌లోని పెరంబర సిల్వర్ కాలేజీలో పాకిస్థాన్ జెండాను ఎగురవేసిన 25 మంది విద్యార్థులపై కేసు నమోదైంది. కాలేజీ ఎన్నికల్లో భాగంగా విద్యార్థులు పాక్ జెండాను పట్టుకుని ఎగురవేసిన ఆరోపణలపై ముస్లిం స్టూడెంట్ ఫ్రంట్ (ఎంఎస్ఎఫ్), కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) విద్యార్థులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, తాము ఎగురవేసింది పాకిస్థాన్ జెండా కాదని ఎంఎస్ఎఫ్ విద్యార్థులు చెబుతున్నారు. ఎంఎస్ఎఫ్ జెండా కూడా పాకిస్థాన్ జెండాలానే ఉంటుందని చెబుతున్నారు. జెండా తిరగబడడంతో దానిని పాక్ జెండాగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే, బీజేపీ మాత్రం అది పాకిస్థాన్ జెండాయేనని, కాలేజ్ క్యాంపస్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని, రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

More Telugu News