Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున దూరం... నేడు నో ఎలిమినేషన్!

  • బర్త్ డే వేడుకల కోసం విదేశాలకు నాగార్జున
  • వీకెండ్ ఎపిసోడ్స్ ను నడిపిస్తున్న రమ్యకృష్ణ
  • నేడు ఎలిమినేషన్ ఉండదంటున్న సోషల్ మీడియా

తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు విదేశాలకు వెళ్లిన నాగార్జున, ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ కు దూరం కాగా, కార్యక్రమాన్ని నడిపించే బాధ్యతను రమ్యకృష్ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో పునర్నవి, హిమజ, మహేశ్ ఎలిమినేషన్ లో నామినేట్ అయ్యారన్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్ ప్రకారం, నాగ్ గైర్హాజరీలో ఈ వారం ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉండదని తెలుస్తోంది. ఈ వారానికి ఎలిమినేషన్ ఉండదని, రమ్యకృష్ణ ద్వారా చెప్పిస్తూ, ఇప్పటికే నేడు ప్రసారం కావాల్సిన ఎపిసోడ్ ను చిత్రీకరించినట్టు సమాచారం. ఇక అసలు విషయం తెలియాలంటే, నేటి రాత్రి వరకూ ఆగక తప్పదు.

More Telugu News