Pakistan: అసోం పౌర జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

  • అసోం పౌర జాబితా విడుదల చేసిన భారత్
  • ట్విట్టర్ లో స్పందించిన పాక్ ప్రధాని
  • ముస్లిం జాతి నిర్మూలనే ధ్యేయంగా మోదీ సర్కారు వ్యవహరిస్తోందంటూ ట్వీట్

అసోంలో నివసిస్తున్న విదేశీయులను ఏరిపారేసేందుకు ఉద్దేశించిన పౌర జాబితాపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కశ్మీర్ అంశాన్ని ఉటంకిస్తూ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం జాతి నిర్మూలనే ధ్యేయంగా మోదీ సర్కారు వ్యవహరిస్తోందంటూ భారత, అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమాద సంకేతాలుగా పరిగణించాలని, ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి కశ్మీర్ దురాక్రమణ అనేది ఓ విస్తృత విధానంలో భాగమని ఇప్పటికే నిరూపితమైందని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్, అసోం పౌర జాబితాలో లేని లక్షల మంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటూ మీడియాలో వచ్చిన ఓ కథనాన్ని కూడా జత చేశారు.

More Telugu News